వెంకన్న గుడిలో దొంగలు

వెంకన్న గుడిలో దొంగలు

విశాఖ పట్టణం: తితిదే పాలక మండలి సభ్యులుగా నేరగాళ్లను నియమించారని తెదేపా సీనియర్ నేత, శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు విమర్శిం చారు. శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. సీబీఐ విచారణను ఎదిరిస్తున్న, నేర చరితుల్ని తితిదే పాలక మండలి సభ్యులుగా నియమించారన్నారు. తిరుమల ఆలయ పవిత్రతను ప్రభుత్వం కాలరాస్తోందని ఆక్రోశించారు. శేఖర్ రెడ్డి దగ్గర లోకేష్ వంద కోట్లు తీసుకుని బోర్డు మెంబర్గా నియమించారని వైకాపా నేత విజయ సాయి రెడ్డి గతంలో ఆరోపించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్ని కోట్లు తీసు కుని ఆయనను పాలక మండలి సభ్యుడుగా నియమించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పచ్చ రాయి తిరుమలలో లేదని జేఈవో ధర్మారెడ్డి విలే ఖరులకు చెప్పారు. దీని గురించి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన వారిపై స్వయం ప్రేరిత కేసు దాఖలు చేయాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos