భానుప్రియకు ఊరట

  • In Film
  • January 25, 2019
  • 725 Views
భానుప్రియకు ఊరట

అందాల నటి అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ భానుప్రియ.. అడపాదడపా ఇప్పుడు కూడా సినిమాల్లో కన్పిస్తుంది. సీరియల్స్లో అయితే ఫుల్ బిజీ. ఇక సీరియల్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. అత్తను కోడలు ఏడిపించడం – కోడల్ని అత్త చంపాలనుకోవడం – ఆడపడుచుల మధ్య కక్షాకార్పణ్యాలు – పనిమనుషుల్ని బానిసలుగా చూడడం. మొత్తం ఇలాంటి కాన్సెప్టులే ప్రస్తుతం సీరియల్స్ లో కన్పిస్తున్నాయి. మరి వీటిని చూసి చూసి – చేసి చేసి అలవాటు అయిపోయిదేమో ఏమో కానీ.. ఇప్పుడు భానుప్రియపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.తన ఇంట్లో పని చేస్తున్న సంధ్య అమ్మాయిని చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా.. ఆమెను ఇంటికి కూడా పోనివ్వకుండా చేస్తుందని సంధ్య తల్లి ప్రభావతి చెన్నై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా భానుప్రియ సోదరుడు సంధ్యతో అసభ్యంగా ప్రవర్తించాడని.. మా అమ్మాయిని మాకు పంపించమంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు ఫిర్యాదు చేసింది ప్రభావతి. దీంతో.. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెద్ద హీరోయిన్ అయ్యిండి భానుప్రియ ఇలా బిహేవ్ చేయడం ఏంటా అని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే.. భానుప్రియ సంధ్యను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తనని ఎవ్వరూ గృహనిర్బంధం చేయలేదని.. భానుప్రియ ఇంట్లో తాను ఆనందంగా ఉంటున్నట్లు పోలీసులకు చెప్పింది సంధ్య. అలాగే.. బానుప్రియ సోదరుడు కూడా తనతో ఎలాంటి మిస్ బిహేప్ చేయలేదని చెప్పింది. మరి తప్పు భానుప్రియదా లేదా ప్రభావతిదా. నిజం తేల్చే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు చెన్నై పోలీసులు. సంధ్య స్టేట్ మెంట్ తో భానుప్రియకు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos