పీకే దృష్టిలో కాంగ్రెస్ స్థాయి ఇది!

పీకే దృష్టిలో కాంగ్రెస్ స్థాయి ఇది!

ఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలపై జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థి కాదని తేల్చి చెప్పారు. బీజేపీ, మహాకూటమి మధ్యే అసలైన పోరని తెలిపారు. అయితే ప్రియాంకా గాంధీ రాక కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రాజకీయాల్లో ఎంతగానో ఎదురు చూస్తున్న నేతల్లో ఆమె ఒకరని పీకే తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కీలకపాత్ర పోషించనున్నారని.. యూపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పునః వైభవానికి ఆమె దోహదపడతారన్నారు. రాహుల్‌, ప్రియాంకల గురించి చెప్పమంటే తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తితో, ఇప్పుడే రాజకీయ ప్రవేశం చేసిన వ్యక్తిని పోల్చి చూడటం సరైన పద్ధతికాదన్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. 2016 నాటి యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంకను ఫ్రతిపాదించమని కాంగ్రెస్‌కు పీకే సూచించారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పీకే ప్రయత్నాలు విఫలమయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos