యరపతినేని పై అక్రమ మైనింగ్ కేసు

యరపతినేని పై అక్రమ మైనింగ్  కేసు

అమరావతి: తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై గనుల అక్రమ తవ్వకాల కేసు శనివారం నమోదయింది. ఆయన గురజాల ఎమ్మెల్యేగా ఉన్నపుడు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని గురవాచారి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని పోలీసులు ఖాతరు చేయక పోవటంతో ఆయన నేరుగా న్యాయస్థానానికి ఫిర్యాదు చేసారు. వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు, యరపతినేని పై కేసు నమోదు చేయాలని పిడుగురాళ్ల పోలీసులను ఆదేశించింది. దరిమిలా యరపతినేని, మరో 12 మందిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు దాఖలు చేశారు. గతంలో యరపతినేని రూ.300 కోట్ల మేర అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు వైకాపా నేతలు ఆరోపించారు. అక్రమ మైనింగ్ ప్రాంతంలో పర్యటించేందుకు ప్రయత్నించిన వైసీపీ నిజనిర్ధారణ సమితిని పోలీసులు గతంలో అడ్డుకున్నారు.ఉన్నచోటే వారిని బంధించి బయట సంచరించకుండా కట్టు దిట్టం చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos