బెంగాల్ కు కేంద్రం మొండి చేయి

బెంగాల్ కు  కేంద్రం మొండి చేయి

కోల్కతా: ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం కరోనా సంక్షోభంపై ముఖ్య మంత్రులతో నిర్వహించనున్న వీడియో సమావేశానికి పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానించకుండా మొండి చేయి చూపారు. ఆమెకు బదులుగా ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా పాల్గొంటారని సచివాలయ వర్గాలు తెలిపాయి. ‘ కేంద్ర మరో సారి బెంగాల్ను అవమానించింది. ముఖ్యమంత్రి మమత ప్రశ్నిస్తారనే కారణంగానే ఆమెను ఆహ్వానించలేదు. ముఖ్య మంత్రుల్ని తమ సమస్యలను తెలిపేందుకు అనుమతించకపోతే వీడియో సమావేశాల పేరిట సమావేశాలు వృధా’ అని విద్యా శాఖ మంత్రి పార్థా ఛటర్జీ ట్విట్టర్ లో ధ్వజ మెత్తారు. అంఫాన్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన బెంగాల్కు కేంద్రం కేవలం రూ. 1000 కోట్లు మాత్రమే సాయం చేసింది. ఇంకా కేంద్రం నుంచి రూ.వేల కోట్లు రావాల్సి ఉంద’న్నారు. మమతా బెనర్జీ ఏం మాట్లాడతారోనన్న భయంతోనే ఆమె పేరును ముఖ్యమంత్రుల జాబితా నుండి తొలగించారని బరాసత్ లోక్సభ సభ్యులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కకోలీ ఘోష్ మండి పడ్డారు. కేంద్రం పక్ష పాతాన్ని బెంగాల్ ప్రజలు మరచి పోరని మరో పార్ల మెంటు సభ్యుడు దినేశ్ త్రివేది వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos