నయనతారపై చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్‌..

  • In Film
  • March 25, 2019
  • 141 Views
నయనతారపై చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్‌..

సినిమా ట్రైలర్‌
లాంచ్‌ వేడుకలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతారపై సీనియర్‌ నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలపై
సర్వత్రా విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.రాధారవి తీరును తప్పుబడుతూ నయనతార
బాయ్‌ఫ్రెండ్‌ విఘ్నేష్‌తో పాటు వరలక్ష్మీ శరత్‌కుమార్‌,చిన్మయిలతో పాటు మరికొంత మంది
నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నయనతార నటించిన కొళయుథిర్‌ కాలం చిత్రం ట్రైలర్‌ లాంచ్‌
సందర్భంగా రాధారవి నయనతారను ఉద్దేశిస్తూ..‘ఒకప్పుడు దేవత పాత్రల కోసం కేఆర్‌ విజయను
సంప్రదించేవారు.దేవత పాత్రలకు కేవలం కేఆర్‌ విజయను మాత్రమే తీసుకునేవాళ్లు.కానీ ఈ రోజుల్లో
ఎవరు పడితే వాళ్లు దేవతల పాత్రలు చేస్తున్నారు.నయనతార దెయ్యంగా నటించారు..సీతాదేవి
పాత్రలో నటించారు.ప్రజల్లో క్రేజ్‌ ఉంటే చాలు వారితో దేవతామూర్తుల వేషాలు వేయిస్తున్నారు.నయనతార
వంటి వారిని చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి’అంటూ రాధారవి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం
రేపుతున్నాయి.రాధారవి చేసిన వ్యాఖ్యలపై తమిళ సినీవర్గాలతో పాటు మహిళా సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి.రాధారవికి
వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రముఖ తమిళ
నటుడు రాధారవి అగ్ర కథానాయిక నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నయన్‌ను తక్కువ చేస్తూ ఆయన మాట్లాడిన తీరు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయ్యింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సీనియర్‌ నటుడు ఇలా ప్రవర్తించడం పట్ల ఇప్పటికే ఆయన సోదరి రాధిక, నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌, గాయని చిన్మయి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ‘అరం’, ‘విశ్వాసం’, ‘ఐరా’ తదితర చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేజేఆర్‌ స్టూడియోస్‌ రాధారవిపై కఠినమైన చర్యలు తీసుకుంది. ఇకపై ఆయన్ను తమ సినిమాలకు తీసుకోమని ప్రకటించింది. ‘రాధారవి వ్యాఖ్యల్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన్ను ఇక మా సినిమాల్లోకి తీసుకోం. ఆయనతో కలిసి పనిచేయొద్దని చిత్ర పరిశ్రమలోని మాతోటి సంస్థలకు, స్నేహితులకు కూడా సలహా ఇస్తున్నాం’ అని ట్వీట్‌ చేసింది. దీంతోపాటు ఓ ప్రకటనను విడుదల చేసింది.
‘రాధారవి ఓ నటి సినిమా ట్రైలర్‌ కార్యక్రమానికి వెళ్లి అదే నటి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన అలా మాట్లాడుతుంటే అక్కడి వారు చూస్తూ కూర్చున్నారు. నవ్వుతూ చప్పట్లు కూడా కొట్టారు. ఆ వ్యక్తి పలుకుబడి, సీనియార్టీ చూసి ఇలా భయపడి మౌనంగా ఉండటం బాధాకరం. రాధారవి ఓ లెజెండరీ కుటుంబం నుంచి వచ్చారు. ప్రియమైన సర్‌.. గొప్పతనం అనేది పేరులో ఉండదు. మన ప్రవర్తన, మాట తీరు బట్టి అదే వస్తుంది. ప్రశంసలు పొందేందుకు మీరు ఏదైనా చెప్పాలి, చేయాలి అనుకుంటే ఇంకా చాలా చోట్లు ఉన్నాయి’.
‘ప్రజలు మాట్లాడడానికి ఇదే
సరైన సమయం. నయనతార, పొల్లాచ్చి కేసు గురించి రాధారవి మాట్లాడింది ఏ మాత్రం సరికాదు. మీరు స్పందించడం వల్ల మార్పు వస్తుందా? రాదా? అనేది రెండో విషయం. ముందు మీ అభిప్రాయం చెప్పండి. వినపడాల్సిన వారికి వినపడేలా మాట్లాడండి. నడిగర్‌ సంఘం మీరు కూడా ఇది విన్నారని ఆశిస్తున్నాం. మా సినిమాల్లోకి ఆయన్ను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆయనపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. మన మహిళలకు మనమే సపోర్ట్‌ చేయకపోతే ఇంకెవరు చేస్తారు?’ అంటూ కేజేఆర్‌ స్టూడియోస్‌ ప్రకటన విడుదల చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos