సూటిగా సుత్తి లేకుండా…

సూటిగా సుత్తి లేకుండా…

తెలంగాణ కాంగ్రెస్‌ లేడీ ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శనస్త్రాలు సంధించారు. మిగతా నేతల్లా ఏవేవో కాలం చెల్లిన,మూస విమర్శలు కాకుండా ప్రతీ ఒక్కరికీ సూటిగా అర్థమయ్యేలా విజయశాంతి విమర్శలు చేసారు.ఏదో ఒక ఆధారాన్ని చూపిస్తూ.. కేసీఆర్ ఇరుకున పడేలా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 69 రోజులకు మంత్రివర్గాన్ని విస్తరించటం.. మంత్రివర్గంలో హరీశ్‌రావుకు చోటు దక్కకపోవటంపై విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.టీఆర్ ఎస్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న వారెవరైనా సరే.. కేసీఆర్ దెబ్బకు ఔట్ కావాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. మొన్న ఆలె నరేంద్ర.. నిన్న నేను.. నేడు తన్నీరు హరీశ్ రావు అంటూ విజయశాంతి చెప్పిన ఉదాహరణకు ఇప్పుడు అందరూ కనెక్ట్ అయ్యే పరిస్థితి. దొరల వారసత్వ పాలన తీరు నాడు.. నేడు.. రేపు.. ఎప్పుడైనా ఇంతేనని తేల్చేశారు.నమ్మిన వారిని తడిగుడ్డతో గొంతు కోయటం టీఆర్ఎస్ నాయకత్వ నైజమన్న విషయం మరోసారి రుజువైందన్నారు. కాలం మారినా టీఆర్ ఎస్ నాయకత్వ వైఖరి మారలేదన్న ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ కు దేవుడిచ్చిన చెల్లెలుగా విజయశాంతి కొద్ది కాలం చెలామణి కావటం తెలిసిందే. అనంతరం ఆమె టీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి సమయం చూసుకొని తన పోస్టులతో షాకుల మీద షాకులు ఇస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos