విజయ్‌కి కాంగ్రెస్ గాలం..

విజయ్‌కి కాంగ్రెస్ గాలం..

దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు కొంచెం భిన్నంగా ఉంటుంది.ఆ రాష్ట్ర రాజకీయాలైతే మరింత గమ్మత్తుగా,చిత్రవిచిత్రంగా ఉంటాయి.ఇక అరవ రాజకీయాలకు,సినిమాలకు దశాబ్దాలుగా విడదీయలేని అనుబంధం ఉంది.ఇప్పటికే చాలా మంది తమిళ రాజకీయాలను ఏలగా తాజాగా కోట్లాది మంది అభిమానగణం ఉన్న ఇళయదళపతి విజయ్‌ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తమిళనాట చర్చలు ఊపందుకున్నాయి.అధికార అన్నాడీఎంకే ప్రతిపక్ష డీఎంకేలు బలంగా ఉన్న నేపథ్యంలో తమిళ హీరోల తాకిడి తమిళ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం డీఎంకేకాంగ్రెస్ పార్టీలు పొత్తుతో ముందుకెళ్తున్నాయి. ఎలాగైనా వచ్చేసారి డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాలున్నాయి. నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తాజాగా తమిళ అగ్రహీరో విజయ్ ను పార్టీలో చేర్చుకునే విధంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో విజయ్ తన సినిమాల్లో బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు. దీంతో సీరియస్ అయిన బీజేపీ ఆయనపై ఐటీ దాడులు చేయించింది. నేపథ్యంలో విజయ్ ను తమ పార్టీలో చేర్చుకొని బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధించవచ్చని కాంగ్రెస్ దాని మిత్రపక్షం డీఎంకే భావిస్తోంది.తాజాగా విజయ్ ను తాము ఆహ్వానించలేదని.. విజయ్ వస్తే మాత్రం సాదరంగా ఆహ్వానిస్తామని కాంగ్రెస్ నేత ఆళగిరి తెలిపారు. కాంగ్రెస్ పగ్గాలు ఇస్తామని సంకేతాలు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన ద్వారాలు తెరిచిందనే చెప్పాలి.అయితే కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ పై విజయ్ మాత్రం వ్యూహాత్మకంగా మౌనం కొనసాగుతోంది. త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos