తిరుమల: శ్రీ వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి అష్టాదళ పాద పద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు. ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు అనుతిస్తారు. 15న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపుతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 23న శ్రీవారి చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయని తితిదే అధికారులు తెలిపారు.