రాజ్యంగాన్ని అంబేద్కరు రాయ లేదు

రాజ్యంగాన్ని అంబేద్కరు రాయ లేదు

అహ్మదాబాద్: భారత రాజ్యాంగాన్నిఅంబేద్కర్ రచించారనేది అందరికీ తెలిసిందే. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ దీనితో విభేధించ టం లేదు. పైగా అంబేద్కరున వేనోళ్ల కొనియాడుతోంది. అదే పార్టీకి చెందిన గుజరాత్ శాసస సభాపతి రాజేంద్ర త్రివేది వాదన ఇందుకు భిన్నంగా ఉంది. రాజ్యాంగాన్ని అంబేద్కరు రాయలేదని అడాలజ్ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన బ్రాహ్మణ వ్యాపారులు బిజినెస్ సదస్సులో సెలవిచ్చి అందరిని దిగ్భ్రాంతికి గురి చేసారు. ‘60 దేశాల రాజ్యాంగాలను అధ్యయ నం చేసి,మన ముసాయిదా రాజ్యాంగం తయారు చేశారని మీకు తెలుసా? ఆ ముసాయిదాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఎవ రు సమర్పించారో మీకు తెలుసా? రాజ్యాంగం విషయానికి వస్తే మన మందరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను గౌరవిస్తాం. అంబే ద్కర్ సొంత మాటల్లోనే ముసాయిదాను బీఎన్ రౌ (బెనెగళ నర్సింగ్ రావు) అనే బ్రాహ్మణుడు తయారు చేశాడు. బ్రాహ్మ ణులు ఎప్పుడూ వెనుక నిలబడి ఇతరులను ప్రోత్సహిస్తారని చరిత్ర చెబుతుంది. బీఎన్ రౌ అంబేద్కర్ను తనకంటే ముందు ఉంచా రు. 1949 నవంబర్ 25 న జరిగిన రాజ్యాంగ సభలో తన ప్రసంగంలో అంబేద్కర్ ఈ విషయాన్ని అంగీకరించినందున మేం గర్విస్తున్నాం. గత నెలలో ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మందిని రక్షించిన ఢిల్లీ అగ్నిమాపకశాఖ జవాన్ రాజేష్ శుక్లా కూడా బ్రాహ్మణుడేనని, ఈయన కూడా తమ బ్రాహ్మణ కులానికి ఆదర్శంగా నిలిచారు. ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీతో సహా తొ మ్మి ది మంది భారతీయ నోబెల్ విజేతలలో ఎనిమిది మంది బ్రాహ్మణుల’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos