అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనీస మద్దతు ధరపై కమిటీ

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనీస మద్దతు ధరపై కమిటీ

న్యూ ఢిల్లీ : కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ఎన్ని కల తర్వాతే ఆ సమితి ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించినందున ఆ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిందని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్ని కల తర్వాతే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అంతకు ముందు తమిళనాడు గవర్నర్ చర్యను నిరసిస్తూ డీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. సభ ప్రారంభం కాగానే తమ సీట్ల నుంచి లేచిన డీఎంకే నేతలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగా సంబంధిత అంశాన్ని ప్రస్తావించాలని ఛైర్మన్ వెంకయ్యనాయుడు సూచించినప్పటికీ వారు శాంతించ లేదు. చివరికి సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు డీఎంకే సభ్యులు ప్రకటించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ ఇటీవల అక్కడి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని గవర్నర్కు పంపగా ఆయన తిప్పి పంపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos