నెలకు రూ.50వేలు ఇస్తానన్నాడు..

  • In Film
  • March 26, 2019
  • 194 Views
నెలకు రూ.50వేలు ఇస్తానన్నాడు..

కృష్ణ,మిరపకాయ్‌ తదితర చిత్రాల్లోనటించి గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కరాటె కళ్యాణి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించారు.సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంటుందనే అభిప్రాయం తప్పని ప్రతీచోట ఈ వేధింపులు ఉన్నాయని సాఫ్ట్‌వేర్‌ రంగంలో కూడా వేధింపులు ఉన్నాయన్నారు.సాఫ్ట్‌వేర్‌ రంగంలో అమ్మాయిలపై చేతులు వేసినా,ముద్దుపెట్టుకున్నా ఎవరూ పెద్దగా పట్టించకోరని కానీ చిత్రపరిశ్రమలో అలాంటి విషయాలు బయటపడితే చాలా పెద్ద విషయమవుతుందన్నారు.ఒక తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రాత్రికి ఫ్రీగా ఉంటావా,బయటకు వెళదామా అని అడిగి వేధింపులకు గురి చేశారన్నారు.కొన్నిసార్లు సరదాకే కదా అని కొంతమందితో బయటకు వెళితే అడ్వాంటేజ్‌ తీసుకోవడానికి ప్రయత్నించారన్నారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి నెలకు రూ.50వేలు ఇస్తానని తాను ఏది చెబితే అది చేయాలని అందుకు సంబంధించి బాండ్‌ రాయాలంటూ అడిగాడన్నారు.అందుకు తాను నిరాకరించడంతో వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలపగా అక్కడి నుంచి రూ.600 అద్దెతో మరో ఇంటికి మారిపోయానన్నారు.అయితే అప్పుడు బాండ్‌ రాయమని డిమాండ్‌ చేసిన నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్‌ అయ్యాడన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos