సెల్ఫీ తల్లీకూతుళ్లను కలిపింది..

సెల్ఫీ తల్లీకూతుళ్లను కలిపింది..

ఆసుపత్రిలో ఓ మహిళకు కవలలు జన్మించడం కానీ అంతలోనే మరో మహిళ అందులో ఒక బిడ్డను దొంగలించి తాను పెంచుకోవడం కొన్ని సంవత్సరాల అనంతరం విడిపోయిన కవలలు అనుకోకుండా కలుసుకొని స్నేహితులు కావడం చివర్లో తాము ఒకే తల్లికి పుట్టిన సంతానమని గుర్తించి తల్లి చెంతకు చేరడం.ఇది వింటుంటూ పాత తరం తెలుగు సినిమాల గుర్తొంది కదా.కానీ దక్షిణాఫ్రికాలో ఈ ఘటన నిజంగానే చోటుచేసుకుంది. సెలెస్టే నర్స్ అనే మహిళకు క్యాసిడి నర్స్ అనే కుమార్తె ఉంది. అమ్మాయి స్థానికంగా ఉన్నతపాఠశాలలో చదువుకుంటోంది. క్యాసిడికి స్కూల్లో మిషే సాల్మన్ అనే అమ్మాయి మంచి స్నేహితురాలు. ఇద్దరు ఇంచుమించు ఒకేలా ఉండడంతో అందరూ సిస్టర్స్ అని పిలుస్తుంటారు. అయితే ఒకరోజు మిషేతో సెల్ఫీ తీసుకున్న క్యాసిడి సెల్ఫీని తన తల్లి సెలెస్టేకు చూపించింది.అచ్చం క్యాసిడిలానే ఉన్న మిషేను చూడగానే సెలెస్టేకు గతం గుర్తుకువచ్చింది. తాను ఆసుపత్రిలో కవలలకు జన్మనివ్వగా అందులో మూడు రోజుల వయసున్న పసికందు జెఫానీ అపహరణకు గురైన విషయం ఆమెకు జ్ఞప్తికి వచ్చింది. మిషే పుట్టినరోజు తెలుసుకున్న తర్వాత సెలెస్టేకు మరింత నమ్మకం కుదిరింది. మిషేను ఒప్పించి డీఎన్ఏ టెస్టు చేయించింది. అందులో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. సెలెస్టే, క్యాసిడిల డీఎన్ఏతో మిషే డీఎన్ఏ సరిపోలింది. దాంతో మిషే తన కుమార్తేనని తెలుసుకున్న సెలెస్టే, 17 ఏళ్ల క్రితం అపహరణకు గురైన బిడ్డ కళ్లముందు నిలిచేసరికి సంతోషంతో ఉప్పొంగిపోయింది.కానీ మిషే ఆనందించడానికి బదులుగా తీవ్ర వేదనకు గురైంది. తాను ఇన్నాళ్లు కన్నతల్లిలా భావించిన లవానో దొంగ అని తెలిసి తట్టుకోలేకపోయింది. తనను దొంగలా ఆసుపత్రి నుంచి ఎత్తుకొచ్చి కన్నతల్లికి దూరం చేసిందని తెలిసి భరించలేకపోయింది. కాగా లవానోను పోలీసులు అరెస్ట్ చేశారు.కథ సుఖాంతం కావడంతో మిషె తన అసలు తల్లి సెలెస్టే, సొంత సోదరి క్యాసిడిలతో కలిసి జీవిస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos