మధ్యప్రదేశ్ బడుల్లో తెలుగు బోధన

మధ్యప్రదేశ్  బడుల్లో తెలుగు బోధన

భోపాల్ : ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు హిందీ, ఆంగ్లంతో పాటు తెలుగును బోధించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఇతర రాష్ట్రాల భాషలను విద్యార్థులకు బోధించనున్నట్లు విద్యా మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ తెలిపారు. తెలుగుతో పాటు మరాఠీ, పంజాబీ భాషల్ని సైతం విద్యార్థులకు నేర్పనున్నట్లు చెప్పారు. “మధ్యప్రదేశ్.. దేశానికి హృదయం లాంటిది. రాష్ట్ర విద్యార్థులకు తమిళం తెలిస్తే తమిళనాడుకు వెళ్లి వారి భాషలోనే మాట్లాడొచ్చు. హిందీ మాట్లాడే ప్రజలు తమ భాషను గౌరవిస్తారని తమిళనాడు ప్రజలు భావిస్తారు. తద్వారా హిందీ భాషకూ గౌరవం పెరుగుతుంది. భాషా వ్యతిరేకత క్రమంగా తగ్గుతుంది.’అని ఇందర్ సింగ్ పర్మార్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల భాషల గురించి విద్యార్థులకు అవగాహన ఉండాలని అభిప్రాయపడ్డారు. 52 జిల్లాల్లోని ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో తెలుగు, పంజాబీ, మరాఠీ భాషలను బోధిస్తామని పేర్కొన్నారు. మాతృభాషలో వృత్తి విద్యా కోర్సులు బోధించాలని అక్కడి సర్కారు ఇది వరకే నిర్ణయించింది. వైద్య విద్యనూ హిందీలోకి తీసుకురావాలని భావిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos