ప్రవీణ్ ఓ సెక్స్ ఉన్మాది..

ప్రవీణ్ ఓ సెక్స్ ఉన్మాది..

తొమ్మిది నెలల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ప్రవీణ్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.ప్రవీణ్‌ చేసిన పనికి ఉరిశిక్ష సరైన శిక్షంటూ ప్రజల నుంచి ప్రముఖుల వరకు న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా నిందితుడు ప్రవీణ్‌ మానసిక పరిస్థితి గురించి వైద్యులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.నిందితుడు ప్రవీణ్‌ పిడీఫిలియా జబ్బుతో బాధ పడుతున్నాడని ఈ జబ్బు ఉన్న వ్యక్తుల్లో సెక్స్‌ కోరికలు ఎక్కువగా ఉంటాయని అందులోనూ చిన్నపిల్లలను చూస్తే నియంత్రణ,విచక్షణ కోల్పోతారని వైద్యులు తెలిపారు.ఇక ప్రవీణ్ గురించి స్థానికులు మాట్లాడుతూఅతను సెక్స్ ఉన్మాది అని చెబుతున్నారు. ఆడవాళ్ల చీరలు బయట తీగలపై ఆరేసి ఉన్నా.. వాటి వాసన చూసి కూడా ఉద్రేకానికి లోనయ్యేవాడని చెబుతున్నారు. ప్రతి నిమిషం సెక్స్ కోసం పరితపిస్తాడని చెప్పారు.  సెక్స్ కోరిక తీర్చుకోవడం కోసం నానా రకాలుగా ప్రవర్తించేవాడని వారు అంటున్నారు.ఇంటి కిటీకిల్లో నుంచి నిద్రపోతున్న మహిళలపై సిరంజితో నీళ్లు పోసేవాడని…  నీళ్లు పడి తడిచిన దుస్తులను ఆడవాళ్లు సరిచేసుకుంటుంటేచూసి వికృతానందం పొందేవాడు. మొదటి నుంచి అతినిది నేర స్వభావం కలిగిన మనస్తత్వమని పోలీసులు చెబుతున్నారు.కొన్ని సంవత్సరాల క్రితం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి చేసుకున్నా కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదని స్థానికులు చెబుతున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos