నైజాంలో లాభాల్లోకి సైరా..

  • In Film
  • October 14, 2019
  • 149 Views
నైజాంలో లాభాల్లోకి సైరా..

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సైరా నరసింహారెడ్డి ఎన్నో అంచనాల మధ్య ఈనెల 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్నా తెలుగు రాష్ట్రాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో వసూళ్ల పరంగా చాలా వెనుకబడింది.తెలుగు రాష్ట్రాల్లో సైతం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనే అనుమానం నెలకొన్న తరుణంలో మూడు రోజుల నుంచి సైరా వసూళ్లు అనూహ్యంగా పుంజుకోవడం పంపిణీదారులకు ఊరటనిస్తోంది.ఇప్పటికే నైజాంలో లాభాల్లోకి ప్రవేశించింది.నైజాంలో నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పిన సైరా ఇప్పటిరవకు రూ.32 కోట్లు వసూలు చేసి పంపిణీదారులకు రూ.2 కోట్లు లాభాలు తెచ్చింది. ఆంధ్ర,రాయలసీమల్లో సైతం నేడో,రేపో లాభాల్లోకి ప్రవేశించనున్నట్లు సమాచారం.మరోవైపు ఉత్తరాదిలో పది రోజుల వరకు పూర్తిగా పడిపోయిన సైరా వసూళ్లు ఆదివారం నుంచి అనూహ్యంగా పుంజుకున్నట్లు తెలుస్తోంది.ముంబై, పూనా, రూర్కెలా వంటి సిటీల్లో హౌస్ ఫుల్ బోర్డ్ లు కనిపించాయి.వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల క్లబ్లోకి చేరిన సైరా చిత్రం.. నార్త్లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆడడంలేదు. బాలీవుడ్లో ఈమూవీ డిజాస్టర్గా ముగిసినట్లే అంచనా వేసారు.10 రోజుల థియేట్రికల్ రన్ని పూర్తి చేసుకున్న సైరా నార్త్లో పికప్ కాలేదు. అయితే నిన్న నార్త్ లో చాలా సిటీల్లో హౌస్ ఫుల్ అవటంతో కాస్త అక్కడ పంపిణీదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos