మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది

మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది

చెన్నై:ప్రధాని మోదీపై తమిళనాడు ముఖ్యమంత్రి , డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళుతుందని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థి టీఆర్ బాలుకు మద్దతుగా శ్రీపెరంబుదూర్లో జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. చరిత్ర తిరగరాస్తుంది. అదే విధంగా సైన్స్ కూడా వెనక్కి వెళుతుంది. అప్పుడు మూఢ నమ్మకాలతో కూడిన కథలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ నియమాలతో నిండిపోతుంది. అలా జరగకూడదంటే.. దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఒక్కటే ఆయుధం’ అని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే తమిళనాడు శత్రువుకు వేసినట్లే అని స్టాలిన్ దుయ్యబట్టారు. ‘బీజేపీకి ఓటేస్తే తమిళనాడు శత్రువులకు వేసినట్లే. అన్నాడీఎంకేకు వేసిన ఓటు రాష్ట్ర ద్రోహులకు వేసినట్లే’ అని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే, బీజేపీ పార్టీలు సహజ మిత్రపక్షాలు అని పిలిచేవారు, కానీ ఇప్పుడు అవి విడిపోయినట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ అవసరమైతే బీజేపీకి మద్దతు ఇస్తారా అని మీడియా ఏఐఏడీఎంకేను ప్రశ్నించినప్పుడు.. ఎడప్పాడి కె. పళనిస్వామి అన్నాడీఎంకే మద్దతు ఇవ్వదని చెప్పలేదని, ‘వెయిట్ అండ్ సీ’ అని సమాధానం చెప్పినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీకి ఎప్పటికీ వ్యతిరేకం కాదని.. ఆ పార్టీకి ఓటేస్తే కమలం పార్టీకి వేసినట్లే అని ముఖ్యమంత్రి స్టాలిన్ దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos