సెల్ఫీ తీసుకున్నా పన్ను వేస్తారేమో

సెల్ఫీ తీసుకున్నా పన్ను వేస్తారేమో

చెన్నై: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పేదలను దోచుకునే విధంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రిఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై సెల్ఫీ తీసుకోవటాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. హోటళ్ల దగ్గర నుంచి ద్విచక్ర వాహనాల మరమ్మతుల వరకు ప్రతిదా నిపైనా పన్ను వసూలు చేస్తుండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ల ఫుడ్ బిల్లుల్లో జీఎస్టీ చూసి మధ్యతరగతి ప్రజలు హడలి పోతున్నారని, ఆ గబ్బర్సింగ్ ట్యాక్స్పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. ‘తర్వాత ఏంటి? సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ విధిస్తారా?’ అని నిలదీశారు. రూ.1.45 లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ను మాఫీచేసిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. పేదలపై మాత్రం కరుణ చూపదా? అని ప్రశ్నించారు. జీఎస్టీ వసూళ్లలో 64 శాతం వాటా పేదల ముక్కుపిండి వసూలు చేసినదేనని పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజల నుంచి 33 శాతం వసూలు చేశారని, సంపన్నుల వాటా కేవలం 1 శాతమేనని ఆక్రోశం వ్యక్తంచేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos