తక్షణమే గవర్నర్‌ను బర్తరఫ్ చేయండి

తక్షణమే గవర్నర్‌ను బర్తరఫ్ చేయండి

చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని బర్తరఫ్ చేయాలని కోరుతూ డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం అందజేసింది. ‘ఆర్ఎన్ రవి రాజ్యాంగం ప్రకారం ఆయన చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారు. ఆయనకు దేశం లౌకిక సిద్ధాంతాలపై విశ్వాసం లేదని బహిరంగంగా ప్రకటించే దురదృష్టకర ప్రవృత్తిని పెంచుకున్నారు. దేశ లౌకిక తత్వానికి అత్యంత నిబద్ధతతో ఉన్న తమ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరం . భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాల వలె ఒక మతంపై ఆధారపడి ఉంది రవి వ్యాఖ్యానించటం గర్హనీయం. తమిళనాడు ప్రభుత్వం, శాసనసభ చేస్తున్న పనిని గవర్నర్ కార్యాలయం బహిరంగంగా వ్యతిరేకించడం ద్వారా, బిల్లులకు ఆమోదం తెలుపడంలో విపరీతమైన జాప్యం చేయడం ద్వారా మా అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాం. తమిళనాడు శాసనసభ అనేక ముఖ్యమైన బిల్లులను ఆమోదించింది. వాటిని ఆమోదం కోసం గవర్నర్కు పంపింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ అన వసరంగా జాప్యం చేస్తున్నారని గమనించడం మాకు బాధ కలిగించింది. రాష్ట్ర పరిపాలనలో, శాసనసభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడమే. అలాగే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం, చట్టాన్ని పరిరక్షిస్తానని.. తమిళనాడు ప్రజల సేవ, శ్రేయస్సు కోసం తనను తాను అంకితం చేస్తానని ఆర్టికల్ 159 కింద చేసిన ప్రమాణాన్ని ఆర్ ఎన్ రవి ఉల్లంఘించారు. తాను చేసిన ప్రమాణానికి భిన్నంగా మత విద్వేషాన్ని రెచ్చగొడుతు న్నారు. రాష్ట్ర శాంతి, ప్రశాంతతకు ముప్పుగా ఉన్నారు. అందువల్ల తన ప్రవర్తన, చర్యల ద్వారా రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని నిర్వహించడానికి ఆర్ఎన్ రవి అనర్హుడనని నిరూపించారు. తక్షణమే బర్తరఫ్కు అర్హులు’’ అని విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos