శ్రీశైలంలో పెరుగుతున్న నీటి మట్టం

శ్రీశైలం : కృష్ణా నదికి వరద పోటు మరింత ఎక్కువ కావడంతో శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరువవుతోంది. సుమారు 2.85 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో నీటి మట్టం వంద టీఎంసీలకు చేరింది. గోదావరిలో కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిండిపోయింది. కడెం నుంచి వచ్చిన వరద నీటితో రెండు రోజుల్లోనే నీటి మట్టం గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద గోదావరి 10.41 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 42.8 అడుగులు ఉంది. ప్రాణహితకు వరద ఉధృతి ఎక్కువైంది. ఆదివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లలో నాలుగు మినహా అన్నిటినీ తెరిచారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8.26 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos