ఒక్కో కేసూ ఒక్కో శౌర్య పతకం

ఒక్కో కేసూ ఒక్కో శౌర్య పతకం

వయనాడ్: ‘దేశ వ్యాప్తంగా నాకు వ్యతిరేకంగా దాఖలు చేస్తున్న కేసులకు భయపడేది లేదు. అవి పతకాల వంటివ’ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వన్యంబళంలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘నాకు వ్యతిరేకంగా దాదాపు 15-16 కేసులు న్నాయి. ఒక్కో సైనికుడి మెడలో చాలా పతకాలు ఉంటాయి. అలాగే నాపై దాఖలైన ఒక్కో కేసూ ఒక్కో పతకం వంటిది. అవి ఎంత ఎక్కువైతే, నేను అంత సంతోషంగా ఉంటాను. వాటితో సైద్ధాంతికంగా పోరాడతాన’న్నారు. ‘నేను విద్వేష పూరిత భారత దేశాన్ని నమ్మబోను. నాకు నచ్చజెప్పడానికి భాజపా ఎంత ప్రయత్నించినా విశ్వసించబోను. మహిళలు, అన్నిమతాల, జాతు ల వారిని, విభిన్న ఆలోచనలుగలవారిని గౌరవించడంలోనే భారత దేశం బలం ఉంద’ని చెప్పారు. ‘నా మీద కేసు పెట్టిన ప్రతిసారీ తాను ప్రేమపూర్వకంగా మాట్లాడతాను. నాకు మద్దతుగా నిలిచినవారిని ఎన్నటికీ మర్చిపోన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos