సూలగిరిలో పూడిక తొలగింపు పనులు

సూలగిరిలో పూడిక తొలగింపు పనులు

హొసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్  లో చెరువులలో పూడిక తొలగింపు పనులు జోరుగా సాగుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలలో నీటి నిల్వలను పెంచడానికి పూడికతీత పనులకు నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలలో పూడికతీత పనులు జోరుగా సాగుతున్నాయి క్రిష్ణగిరి జిల్లాలోని సూలగిరి యూనియన్ లో అనేక చోట్ల పూడికతీత పనులు జరుగుతున్నాయి. సోమవారం అత్తిముగం పంచాయతీలోని కరియసంద్రం గ్రామంలో గల చెరువులో 9 లక్షల ఖర్చుతో పూడికతీత పనులకు గాను సూలగిరి యూనియన్ ఛైర్ పర్సన్ లావణ్య హేమానా థ్ విచ్చేసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. సూలగిరి యూనియన్ లోని అన్ని చెరువులలో పూడిక తీయించి భూగర్భ జలాలు పెంచుకొనేందుకు కృషి చేస్తామని లావణ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు బీడీవోలు విమల్, బాలాజీ, గ్రామస్థులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos