మాజీ న్యాయమూర్తిచే ఎదురు కాల్పుల విచారణ

న్యూఢిల్లీ: ‘దిశ’ నిందితుల్ని పోలీసులు ఎదురు కాల్పుల పేరిటి హతం చేసిన సంఘటనపై అత్యున్నత న్యాయ స్థానం నివృత న్యాయమూర్తితో విచారణ జరిపించే అంశాన్ని పరిశీలిస్తున్నాం అని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం బుధ వారం తెలి పింది. ఇక్కడే ఉండి దర్యాప్తు చేసేలా చూస్తామని వెల్లడించింది. విచారణ చేపట్టేందుకు నివృత న్యాయమూర్తి పి.వి.రెడ్డి నిరాక రించారని పేర్కొంది. దర్యాప్తు గురించి సలహాలు, సూచనలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతోందన్న ప్రధాన న్యాయమూర్తి బోబ్డే తదుపరి విచారణను గురు వారానికి వాయిదా వేశారు. తమ వాదనల్ని విన్న తర్వాత తదుపరి చర్యల్ని చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గి కోరారు. ప్రత్యేక బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖ లైంది. ఎదురు కాల్పులకు పాల్పడిన పోలీసులపై స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపైనా విచారణ చేపట్టాలని న్యాయవాది జీఎస్ మణి చేసిన వినతినీ ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పరిశీ లిం చింది. మరో న్యాయవాది ఎం.ఎల్.శర్మ కూడా ఇదే తరహా పిల్ దాఖలు చేశారు. సిట్ దర్యాప్తు అత్యున్నత న్యాయ స్థానం మాజీ న్యాయ మూర్తుల పర్యవేక్షణలో సాగా లనీ విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos