విజయశాంతి పిక్ టాక్..సరిలేరు నీకెవ్వరు..

  • In Film
  • August 12, 2019
  • 132 Views
విజయశాంతి పిక్ టాక్..సరిలేరు నీకెవ్వరు..

తెలుగు సూపర్‌ష్టార్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ టీజర్‌తో మహేశ్‌ నటిస్తున్న కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి.ఈ అంచనాలను మరింత పెంచేలా దర్శకుడు అనిల్‌ రావిపూడి చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్న అలనాటి లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి ఫోటోను విడుదల చేశాడు.దీంతో మహేశ్‌బాబు అభిమానులతో పాటు విజయశాంతి అభిమానులు కూడా ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.విజయశాంతికి సంబందించిన స్టిల్ ను విడుదల చేయాలంటూ ఎప్పటినుంచో మహేష్ అభిమానులు కోరుతున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్‌ ఈ ఫోటో విడుదల చేశాడు.అనిల్ సుంకరదిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ను సంక్రాంతికి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.  

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos