ఎస్‌ బ్యాంకుకు ఎస్పీజీపీ ఆసరా

ఎస్‌ బ్యాంకుకు ఎస్పీజీపీ ఆసరా

ముంబై : వివాదంలో చిక్కుకుని సంక్షోభంలో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు ఎస్బ్యాంకు బలమైన ఆసరా లభించింది. హాంకాంగ్కు చెందిన ఎస్పీజీపీ హోల్డింగ్స్ నుంచి 1.2 బిలియన్ డాలర్ల బైండింగ్ వెసలుబాటును అందుకున్నట్లు ఎస్బ్యాంకు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఈక్విటీ వాటాల ద్వారా ఈ పెట్టుబడులను పొందనుంది. ఇది రెగ్యులేటరీ ఆమోదాలు, షరతులు, బ్యాంక్ పాలక మండలి, వాటాదారుల ఆమోదాలకు లోబడి ఉంటుంది. ఈ ప్రకటన తర్వాత ఎస్ బ్యాంకు షేర్లు 35 శాతం పెరిగాయి. ఇతర దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చలు పురోగతిలో ఉన్నాయనీ బ్యాంకు తెలిపింది. నవంరు 1న విడుదల చేయనున్న త్రైమాసిక ఫలితాల సందర్భందగా ఈ వ్యవహారం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos