భారత్ మాల కింద ఏపీలో రోడ్లు

భారత్ మాల కింద ఏపీలో రోడ్లు

న్యూ ఢిల్లీ: భారత్ మాల పరియోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు రోడ్లను నిర్మించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో గురువారం సాయంత్రం ప్రశ్నించారు. రాయపూర్- వైజాగ్ ఆర్దిక కారిడార్ కింద ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు అభివృద్ధి జరిగిందని కూడా అడిగారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ 2017 అక్టోబర్ లో భారత్ మాల పరియోజన పథకం కింద 34,800 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేయాలని సంకల్పించినట్లు రాతపూర్వకంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,241 కిలోమీటర్ల పొడవు అభివృద్ధి చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. ఇందులో లో 857 కిలోమీటర్ల రోడ్లకు 30,551 కోట్ల రూపాయలు కేటాయించగా దాదాపు 311 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రాయపూర్- వైజాగ్ ఆర్థిక కారిడార్ మొత్తం పొడవు 464 కిలోమీటర్లు కాగా ఇందులో ఆంధ్రప్రదేశ్ కు 356 కిలోమీటర్లు కేటాయించారని తెలిపారు. దీన్ని నాలుగు ప్యాకేజీలుగా విభజించారని పేర్కొన్నారు. ఈ 4 ప్యాకేజీల కోసం 3,183 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos