F..K..రైతులకు మీరేం చేశారు ?

  • In Film
  • March 13, 2019
  • 139 Views
F..K..రైతులకు మీరేం చేశారు ?

రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు,సమస్యల గురించి డాక్యుమెంటరీ రూపొందిస్తున్న టాలీవుడ్‌ నటి రేణు దేశాయ్‌ కర్నూలు జిల్లాలో పర్యటించి రైతుల సమస్యల గురించి తెలుసుకున్న విషయం విదితమే.రేణుదేశాయ్‌ రైతుల కష్టాల గురించి తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంపై సామాజిక మాధ్యమాల్లో ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌పై అందులో సదరు వ్యక్తి వాడిన భాషపై రేణుదేశాయ్‌ మనస్తాపానికి గురై సుదీర్ఘమైన సమాధానమిచ్చారు.రేణుదేశాయ్‌ చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి నేను కూడా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని.గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటివరకు మీరు రైతులకు F..K ఏం చేశారు.ఏమి చేయలేదు.ముఖాలకు రంగులు వేసుకొని డబ్బుల కోసం కెమెరాల ముందు నటించడం తప్ప అని ఘాటుగా విమర్శిస్తూ పోస్ట్‌ చేశాడు. సదరు వ్యక్తి చేసిన పోస్ట్‌పై రేణుదేశాయ్‌ స్పందిస్తూ..ఈ పోస్ట్‌ మీరు కచ్చితంగా చదువుతారని అనుకుంటానే. ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా *F*అనే పదాన్ని సామాజిక మాధ్యమాల్లో ఒక అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు.అది ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుంది.నిర్దయగా చాలా దారుణంగా ఆ సెలబ్రిటినీ ట్రోల్‌ చేస్తూ దూషిస్తారు.కానీ అదే పదం మాములు వ్యక్తులు సెలబ్రిటీలపై వాడితే సెలబ్రిటీలు మౌనంగా భరించాలి.సెలబ్రిటీలకు భాగోద్వేగాలు ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. రైతులకు ఏదోఒక విధంగా సహాయ పడడానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ దూషించడం సరికాదన్నారు. ఇక్కడ నేను దేనికోసం మాట్లాడుతున్నానో ముఖ్యం కాదు నేనే చేసే ప్రయత్నం వల్ల రైతుల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి అదే ముఖ్యమన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos