హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నా..

  • In Film
  • February 23, 2020
  • 135 Views
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నా..

ఛలోతో తెలుగులో అడుగుపెట్టి, టాప్ హీరోల పక్కన చాన్స్ కొట్టేస్తూ, సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగిన రష్మికా మందన్న, హైదరాబాద్‌లో ఇల్లు కొనాలని భావిస్తోంది. విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.తెలుగులో ఇంకో రెండు సినిమాల తరువాత ఇల్లు కొనుక్కుంటానని, తనకు ఇక్కడే ఉండి పోవాలని అనిపిస్తోందని అంటోంది.నన్ను తెలుగు అమ్మాయిలానే చూస్తున్నారని నేను సైతం తెలుగులో మాట్లాడ్డం నేర్చుకున్నానని ఇప్పుడు అచ్చు తెలుగమ్మాయిలా మారిపోయానని తెలిపింది.తనకు కోపం వస్తే షాపింగ్‌ చేస్తానని సంప్రదాయ దుస్తులనే అధికంగా ఇష్టపడతానని చెప్పుకొచ్చింది తనను అందరూ తెలుగు అమ్మాయిననే అనుకుంటున్నారని, మధ్య తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నానని రష్మిక తెలిపింది. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకుంటే, ఫిట్ నెస్ కు సంబంధించిన వ్యాపారం చేసుండేదాన్నని వెల్లడించింది.తనకు చార్మినార్ చూడాలని ఉందని, ఏదో ఒక రోజు రాత్రి పూట మారు వేషంలో అయినా అక్కడికి వెళ్లి వస్తానని, గోల్కొండ కోటను కూడా చూడాల్సి వుందని రష్మిక చెప్పింది. మూడేళ్ల క్రితం తాను హైదరాబాద్ కు వచ్చినప్పుడు బిర్యానీ తెగ తినేదాన్నని, కానీ ఇప్పుడు మాత్రం నాన్ వెజ్ తినడం మానేశానని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos