రామ్ జెఠ్మలానీ కన్నుమూత..

రామ్ జెఠ్మలానీ కన్నుమూత..

ప్రముఖ సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ(96) ఆదివారం తుదిశ్వాస విడిచారు.కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న జెఠ్మలానీ ప్రైవేటు ఆదివారం ఢిల్లీలోని ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.1923 సెప్టెంబర్ 14న ముంబయిలో జన్మించిన రామ్ జెఠ్మలానీ తన కెరీర్లో ఎన్నో కీలక,వివాదాస్పద కేసులు వాదించారు. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా కేసుతో పాటు పీవీ నరసింహరావు కేసులను వాదించారు.అరుణ్జైట్లీ,అరవింద కేజ్రీవాల్తో పాటు ఇందిరాగాంధీ హంతకుల తరపున,హర్షద్ మొహతా,అఫ్జల్ గురు కేసులను కూడా వాదించారు.అన్నికటికంటే ముఖ్యంగా అండర్వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ తరపున కేసు వాదించి స్మగ్లర్ న్యాయవాదిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు.వాజ్పెయి హాయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన జెఠ్మలానీ 2004లో లక్నో నుంచి వాజ్పెయి నుంచే పోటీకి దిగారు.జఠ్మాలనీ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా… జెఠ్మాలనీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.2017లో న్యాయవాద వృత్తికి స్వస్తి పలికిన జెఠ్మలానీ కొడుకు కూతురు కూడా న్యాయవాదులే.కొడుకు మహేష్ జెఠ్మలానీ ప్రముఖ న్యాయవాదిగా రాణిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos