మరో పది రోజులు వర్షాలే…

అమరావతి : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలతో రెండు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. అంతేకాకుండా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎపిలోని గోదావరి, కృష్ణా, తుంగభద్ర వంటి నదులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ నెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వివరించింది. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆగస్టు 3 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలు కురుస్తాయని ఐఎండి తెలిపింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos