ఈసారి 106 శాతం వర్షపాతం

ఈసారి 106 శాతం వర్షపాతం

న్యూ ఢిల్లీ: నైరుతి రుతు పవనాల వల్ల సాధారణం కంటే అధిక వానలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా ఆ మేరకు విస్తారంగా వర్షాలు కురిసేందుకు 106 శాతం అవకాశాలు ఉన్నట్టు వివరించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరానికి చేరుకుంటాయి. సెప్టెంబరు మాసం రెండో వారం నుంచి తిరోగమనం ప్రారంభిస్తాయి. దాదాపు నాలుగు నెలల పాటు దేశంలో అత్యధిక ప్రాంతాల్లో వర్షపాతాన్ని ఇస్తాయి. 96 శాతం నుంచి 104 శాతం మధ్యన ఉంటే దాన్ని సగటు లేదా సాధారణ వర్షపాతంగా పిలుస్తారని, అంతకుమించితే దాన్ని సాధారణం కంటే అత్యధికం అంటారని ఐఎండీ స్పష్టత ఇచ్చింది. గత కొంతకాలంగా ఎల్ నినో పరిస్థితులతో క్షామ పరిస్థితులను చవిచూసిన భారత్ కు ఈసారి లా నినా పరిస్థితులు కలిసి వస్తాయని ఐఎండీ చెబుతోంది. లా నినాతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos