దేశ ప్ర‌జ‌ల‌పై ఒకే భాష‌, ఒకే చ‌రిత్ర‌ను రుద్దేందుకు కాషాయ పార్టీ కుట్ర

దేశ ప్ర‌జ‌ల‌పై ఒకే భాష‌, ఒకే చ‌రిత్ర‌ను రుద్దేందుకు కాషాయ పార్టీ కుట్ర

కన్నూర్: దేశ ప్రజలపై ఒకే చరిత్ర, ఒక జాతి, ఒకే భాషను రుద్దాలని బీజేపీ కోరుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కేరళలోని కన్నూర్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. భారత్ వైవిధ్యతను కాంగ్రెస్, యూడీఎఫ్ ఆమోదిస్తాయని, తాము భిన్న భాషలను, భిన్న సంస్కృతులను, భిన్న చరిత్రను గౌరవిస్తామని చెప్పారు. దేశ ప్రజల భిన్నమైన భావాలను గుర్తెరిగి అంగీకరిస్తామని అన్నారు. ఉదాహరణకు కేరళ నుంచి మళయాళాన్ని తొలగిస్తే రాష్ట్రంలోని మహిళ తన పిల్లలకు ఈ భూమి గొప్పతనం గురించి ఎలా వివరించగలదని రాహుల్ ప్రశ్నించారు. అందుకే భిన్న భాషలు, సంస్కృతులు, చరిత్రను తాము ఆమోదిస్తామని వివరించారు. ఇందుకు విరుద్ధంగా కాషాయ పార్టీ భిన్న మతాలు, భాషలు, సంస్కృతుల మధ్య చిచ్చు రేపి రాజకీయ లబ్ధికి పాకులాడుతోందని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos