అవినీతికి ఛాంపియన్ ప్రధాని మోదీ

అవినీతికి ఛాంపియన్ ప్రధాని మోదీ

లఖన వ్ : ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి ఛాంపియన్ అని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రద్దు చేసిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి రాహుల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ స్క్రిప్డ్ అని విమర్శించారు. పారదర్శకత కోసం ఎన్నికల బాండ్లను తీసుకొచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. అదే నిజమైతే ఆ వ్యవస్థను సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. “ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం. దేశంలోని వ్యాపారవేత్తలందరూ దీన్ని అర్థం చేసుకున్నారు. ప్రధానమంత్రి ఎంత స్పష్టత ఇవ్వాలనుకున్నా దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రధాని అవినీతికి నాయకుడని దేశం మొత్తానికి తెలుసు” అని రాహుల్ గాంధీ రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos