ఆర్మీ దిగి ఉంటే .. హింస మరింత పెరిగేది

ఆర్మీ దిగి ఉంటే .. హింస మరింత పెరిగేది

న్యూ ఢిల్లీ : సిక్కుల ఊచ కోతకు సంబంధించి మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు వ్యతిరేకంగా మాజీ ప్రధాని మన్మో హన్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని పీవీ నరసింహారావు మనుమడు, బీజేపీ నేత ఎన్వీ సుభాశ్ ఖండించారు. ‘పీవీ కుటుంబ సభ్యునిగా ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా దిగులుపడుతున్నా. మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు సమర్థించేవి కావు. మంత్రివర్గ ఆమోదం లేకుండా ఏ హోంమంత్రైనా సొంత నిర్ణయం తీసుకుంటారా? ఆ సమయంలో ఆర్మీని రంగంలోకి దించినట్లైతే మరింత పెద్ద విపత్తు జరిగి ఉండేద’ని వ్యాఖ్యానించారు. 1984 సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహా మేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని బుధవారం ఢిల్లీలో జరిగిన గుజ్రా ల్ శత జయంత్యుత్సవంలొ మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆ అల్లర్లు జరిగిన రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నందున ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని పీవీకి సూచిం చారని గుర్తు చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos