‘ముజఫర్పూర్’ దోషులకు ‘జీవిత ఖైదు’ శిక్ష

‘ముజఫర్పూర్’ దోషులకు ‘జీవిత ఖైదు’ శిక్ష

ముజఫర్పూర్ కేసు దోషులకు శిక్ష ఖరారు
న్యూఢిల్లీ: ముజఫర్పూర్ వసతి గృహం బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన నేరానికి బ్రజేశ్ ఠాకూర్కు ఢిల్లీ న్యాయస్థానం మంగళ వారం సహజ మరణం పొందే వరకు జీవిత ఖైదు శిక్షను విధించింది. మరో 18 మంది దోషుల్లో 11 మందికి కూడా జీవిత ఖైదు శిక్ష పడింది. ఒక నిందితుణ్ని గతంలోనే నిర్దోషిగా ప్రకటించింది. ముజఫర్పూర్లో బిహార్ పీపుల్స్ పార్టీ(బీపీపీ)కి చెందిన బ్రజేశ్ ఠాకూర్ నిర్వహిస్తున్న వసతి గృహం లోని దాదాపు 42 మంది బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలకు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. 2018, మే 26న టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఈ దారుణాల్ని బయట పెట్టింది.34 మందిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. నిందితుల్లో ఎనిమిది మంది మహిళలు కూడా ఉన్నారు. కేసు గంభీరత దృష్ట్యా దాన్ని సీబీఐకి అప్పగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos