కూతుళ్లకూ సమాన ఆస్తి హక్కు

న్యూ ఢిల్లీ: కుటుంబంలోని కూతుర్లు, కొడుకులకు ఆస్తి హక్కులు సమానంగా ఉంటాయని న్యాయమూర్తి అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత న్యాయ స్థానం ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి మరణించినా, తల్లిదండ్రుల ఆస్తిపై కూతుర్లకూ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. చట్ట సవరణ జరిగిన 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos