తలాఖ్‌ కు తలూపిన ముఫ్తీ పార్టీ

తలాఖ్‌ కు తలూపిన ముఫ్తీ పార్టీ

న్యూ ఢిల్లీ : వివాదాస్పద ముమ్మారు తలాక్ ముసాయిదా రాజ్యసభ ఆమోదం సందర్భంగా పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) సభ్యులు అనుసరించిన విధానం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘ఎట్టి పరిస్థితుల్లో బిల్లుకు మద్దతు తెలిపేది లేదు. తమ సభ్యులు కచ్చితంగా భాజపా ముసాయిదాకు వ్యతిరేకంగానే ఓటు వేస్తారని’ ఆ పార్టీ అధినేత మొహబూబా ముఫ్తీ ప్రకటించారు. కానీ, అనూహ్యంగా పీడీపీ సభ్యులు ఇద్దరు సభ్యులు వాకౌట్ చేసి పరోక్షంగా ముసాయిదా ఆమోదానికి సహకరించారు. ‘అప్పటికప్పటి తలాఖ్ చట్ట విరు ద్ధమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిన తర్వాతా దానిపై చట్టాన్ని చేయాల్సిన అవసరం ఏముందో అర్థం కాలేదు. ఈ అనవసరపు జోక్యం ముస్లింలను శిక్షించడానికే. ప్రస్తుతం మనమున్న ఆర్థిక పరిస్థితుల్లో దీనికి అంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా?’అని ముసాయిదా నెగ్గిన తర్వాత ముఫ్తి ట్వీట్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఓటింగ్కి తమ పార్టీ సభ్యులు గైర్హాజరు గురించి స్పందించ లేదు. పీడీపీ సభ్యుల వైఖరి పై ప్రత్యర్థి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విరుచుకుపడ్డారు. సభలో పరోక్షంగా భాజపాకు సహకరించి తిరిగి అదే పార్టీపై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos