విజయనిర్మలపై ప్రభుత్వాల చిన్నచూపు..

  • In Film
  • June 28, 2019
  • 156 Views
విజయనిర్మలపై ప్రభుత్వాల చిన్నచూపు..

కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ప్రకటించే పద్మశ్రీ అవార్డుల్లో కులమతాలు,ప్రాంతాలు,రాజకీయాల ప్రాతిపాదికన ఇస్తున్నారనే విమర్శలుల,ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.పద్మశ్రీ అవార్డుల్లో ఎక్కువగా ఉత్తరాది ప్రముఖులకే ఇస్తున్నారని పద్మశ్రీ అవార్డులకు ఎంపికలో కూడా దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.అనారోగ్యంతో మృతి చెందిన తెలుగు సీనియర్‌ నటి,దర్శకురాలు విజయనిర్మలకు ఇప్పటి వరకు పద్మశ్రీ అవార్డు దక్కకపోవడం చూస్తే ఈ ఆరోపణలు నిజమేనన్న భావన కలుగకమానదు.ఆరు దశాబ్దాల సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో అరుదైన రికార్డులను ఘనతలను సొంతం చేసుకొన్నారు. 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించారు. అయితే ప్రభుత్వ అవార్డుల విషయంలో దేశ సినీ చరిత్రలోనే ఎవరికీ జరుగని అన్యాయం విజయ నిర్మలకు జరిగిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నది. నటిగా తెలుగు,తమిళ,మలయాళం భాషల్లో 200కు పైగా చిత్రాల్లో ప్రతిభ చాటుకున్న విజయ నిర్మల 1971లో మీనా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి 2009 వరకు మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువులు ఆరుకాయలు, హేమా హేమీలు, రాం రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది. భోగి మంటలు, లంకె బిందెలు, రెండు కుటుంబాల కథ అనే సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలుగా మిగిలిపోయాయి. ప్రపంచ సినిమా చరిత్రలోనే 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళగా పేరొందిన విజయ నిర్మలకు పద్మ అవార్డుకు నోచుకోలేకపోవడం గమనార్హం.ప్రతీ ఏటా పద్మ అవార్డులు వెల్లడించే వేళ ప్రతీసారి విజయ నిర్మల పద్మ అవార్డు వస్తుందేమోనని ఆశగా ఎదురు చూడడం చిరవకు పేరు లేకపోవడంతో నిరాశ చెందడం.అయినప్పటికీ ఎప్పుడూ,ఎక్కడ కూడా తనకు పద్మశ్రీ అవార్డు దక్కలేదననే ఆరోపణలు,ఫిర్యాదు కూడా చేయకుండా హుందాగా వ్యవహరించారు.మరో విస్మయపరిచే విషయం ఏంటంటే 90వ దశకం నుంచి నిన్నమొన్న చిత్ర పరిశ్రమల్లోకి అడుగు పెట్టిన గ్లామర్ హీరోయిన్లు విద్యాబాలన్, కాజోల్‌, టబు, ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్ ఖాన్, గాయని ఉషా ఉతప్, మధురు భండార్కర్, ప్రభుదేవా లాంటి ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు దక్కాయి.విజయనిర్మలతో పోలిస్తే పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్న ఈ ప్రముఖులంతా చిత్రపరిశ్రమకు చేసింది శూన్యం.అటువంటిది ఈ నటీనటులకు ఇచ్చి ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక చిత్రాలకు దర్వకత్వం వహించడమే కాకుండా, నటిగా తెలుగు, తమిళ, మలయాళంలో 200 సినిమాల్లో నటించి.. అన్ని అర్హతలు ఉన్న విజయ నిర్మలకు ఎందుకు ఇవ్వలేదనే అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

 

 

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos