స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో మోదీ, ఆదిత్యనాథ్ చెప్పాలి

స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో మోదీ, ఆదిత్యనాథ్ చెప్పాలి

హైదరాబాదు నటి కంగనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మన దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఒక మేడమ్ మనకు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారని ఎద్దేవా చేశారు. ఇదే వ్యాఖ్యలు ఒక ముస్లిం చేసి ఉంటే… ఇప్పటికే దేశద్రోహం కేసు పెట్టి, మోకాళ్లపై కాల్పులు జరిపి, ఆ తర్వాత జైలుకు పంపేవారని అన్నారు. ఆమె ఒక రాణి అని వ్యాఖ్యానించారు. మీరు (యోగి ఆదిత్యనాథ్) రాజు అయినప్పటికీ ఆమెను ఏమీ చేయర’ని విమర్శించారు. ‘టీ20 మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ గెలుపొందిన తర్వాత సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు పెట్టారు. ఇప్పుడు కంగనపై కూడా అవే కేసులు నమోదు చేస్తారా? విద్రోహం కేసులను కేవలం ముస్లింలపైన మాత్రమే పెడతారా? ఇంతకూ మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పాల’ని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos