నితీశ్ సభలో లాలూకు జేజేలు

నితీశ్ సభలో లాలూకు జేజేలు

పట్నా: పార్సా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తున్నపుడు కొందరు లాలూ జిందాబాద్ అని నినాదాలు చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. ఏం మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ‘అర్థం లేని మాటలు మాట్లాడేవారు ఎవరో కాస్త చేయి పైకి చాపాలి. సభలో గందరగోళం సృష్టించొద్దు. నాకు ఓటు వేయాలనే ఉద్దేశం ఉంటే వేయండి. లేకపోతే వద్దు’ అని మండి పడ్డారు. తన ప్రసంగానికి అంతరాయం కలిగించేలా నినాదాలు చేస్తున్న వారి ప్రవర్తన ఆమోదయోగ్యమైనదేనా అని సభలో ఉన్నవారిని నితీశ్ ప్రశ్నించినపుడు మద్దతుదారులు వ్యతిరేకంగా స్పందించారు. ఆ సమయంలో వేదికపై నీతీశ్తో పాటు ఇటీవలే ఆర్జేడీ నుంచి జేడీయూలో చేరిన చంద్రిక రాయ్ ఉన్నారు. చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్యను లాలూప్రసాద్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహం తర్వాత తలెత్తిన విబేధాలతో ఆయన ఆర్జేడీని వీడి జేడీయూలో చేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos