బాపూ పై వ్యాఖ్యలకు బదిలీ శిక్ష

బాపూ పై వ్యాఖ్యలకు బదిలీ శిక్ష

ముంబై: జాతిపిత మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు బీఎంసీ డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ నిధి చౌదరిపై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేయటమే కాకుండా ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యల గురించి వివరించాలని తాఖీదు కూడా ఇచ్చింది. ‘ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహాలను కూల్చేయాలి. కార్యాలయాల్లో ఆయన చిత్ర పటాల్ని తొలగించాలి. కరెన్సీ నోట్లపై ఆయన ఫొటో తీసేయాలి. గాంధీజీని హత్య చేసిన గాడ్సేకు కృతజ్ఞతలు’ అని ఆమె చేసిన ట్వీట్కు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దరిమిలా ఆమె ఆ ట్వీట్‌ను తొలగించారు. తాను బుద్ధి పూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. గాంధీని సామాజిక మాధ్యమాల్లో అడ్డు అదుపూ లేకుండా విమర్శలు వచ్చిననందుకు నిరసనగా వ్యంగ్యంగా ట్వీట్ చేసినట్లు విపులీకరించారు. ఇలాంటివి చూడాల్సిన బాధ లేకుండా మహాత్ముడిని చంపిన గాడ్సేకు కృతజ్ఞతలు చెప్పానని వివరణ ఇచ్చారు. గాడ్సేను కీర్తించినందుకు పలువురు ఆగ్రహించారు. బాధ్యతా యుతమైన హోదాలో ఉండి ఈ వ్యాఖ్యలు చేసిన ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలనీ డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos