కౌశల్‌పై పేలుతున్న సెటైర్లు..

  • In Film
  • September 17, 2019
  • 126 Views
కౌశల్‌పై పేలుతున్న సెటైర్లు..

తెలుగు బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో కౌశల్‌కు మద్దతుగా ఏర్పడ్డ కౌశల్‌ ఆర్మీ చేసిన రచ్చ అంతాఇంతా కాదు.కౌశల్ ఆర్మీ కారణంగా కౌశల్‌కు విపరీతమైన పాపులారిటీ దక్కింది.అయితే ఇది గడచి ఏడాది గడుస్తున్నా కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడంటూ తాజాగా సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న కౌశల్ ని మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న అడిగారు.బిగ్ బాస్ సీజన్ 3 టాప్ కంటెస్టంట్ల పేర్లు చెప్పాలని అడగగా.. ”నేను ఇప్పుడు ఒకరి పేరు చెబితే నా ఆర్మీ మొత్తం వారికే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని” చెప్పారు. ఈ విషయంలో నెటిజన్లు కౌశల్ ని ఏకిపారేస్తున్నారు. ఇంకా నీ ఆర్మీ ఉందా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. కౌశల్ ఇంకా అదే భ్రమలో ఉన్నాడని విమర్శిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos