సెరిలాక్‌లో మోతాదుకు మించి షుగ‌ర్‌.

సెరిలాక్‌లో మోతాదుకు మించి షుగ‌ర్‌.

న్యూఢిల్లీ: నెస్లే కంపెనీకి చెందిన బేబీ ఫుడ్ ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న విషయం తెలిసిందే. రెండు బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తుల్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. అయితే బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో అమ్ముడవుతున్న ఆ ఉత్పత్తుల్లో షుగర్ లెవల్స్ సాధారణ స్థాయిలో ఉన్నట్లు ఓ దర్యాప్తులో తేలింది. శిశువులకు ఇచ్చే పాలల్లో షుగర్తో పాటు తేనె జోడించిన ఉత్పత్తులను నెస్లే అమ్ముతోంది. దీంతో పాటు సిరల్ ప్రొడక్ట్స్ కూడా అనేక దేశాల్లో అమ్ముడుపోతున్నాయి. అయితే అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు నెస్టే కంపెనీపై ఆరోపణలు వస్తున్నాయి. ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమైన షుగర్ మోతాదును ఎక్కువగా వాడుతున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని నెస్లే ఉత్పత్తుల్లోనే షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.
ఇండియాలో ఉన్న 15 సెరిలాక్ బేబీ ఉత్పత్తుల్లో సగటున మూడు గ్రాముల అధిక షుగర్ ఉన్నట్లు గుర్తించారు. కానీ నెస్లే ఇండియా కంపెనీ ప్రతినిధి మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. గత అయిదేళ్లలో శిశువుల సెరిలాక్లో షుగర్ను 30 శాతం తగ్గించినట్లు పేర్కొన్నారు. చిన్నారులకు కావాల్సిన పోషక విలువలతో కూడిన ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. అత్యుత్తమ, నాణ్యమైన వస్తువులను వాడుతున్నట్లు చెప్పారు. 3 గ్రాముల షుగర్ ఎక్కువగా ఉన్న సెరిలాక్ బేబీ ప్రొడక్ట్స్ను ఇండియాలో అమ్ముతుండగా.. జర్మనీ, బ్రిటన్ దేశాల్లో ఆ ఉత్పత్తులో షుగర్ సాధారణ స్థాయిల్లోనే ఉన్నది. ఇక ఇథియోపియా, థాయిలాండ్ దేశాల్లో మాత్రం షుగర్ 6 గ్రాములు ఉన్నట్లు స్టడీలో కనుగొన్నట్లు చెప్పారు. అయితే అదనపు షుగర్ గురించి ఉత్పత్తులపై ఎటువంటి సమాచారం ఉండదని తెలుస్తోంది. విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ గురించి చెప్పిన కంపెనీ..ఆ స్థాయిలో షుగర్ను కలిపినట్లు పేర్కొన్నారు. 2022లో ఇండియాలో నెస్లే కంపెనీ సుమారు 20 వేల కోట్ల ఖరీదైన సెరిలాక్ ఉత్పత్తుల్ని అమ్మింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos