వైఎస్ జగన్‌పై నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు..

వైఎస్ జగన్‌పై నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు..

పోలవరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ టెండర్లు రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటన అందులో భాగంగా నవయుగ,బెకం సంస్థలను పోలవరం నుంచి తప్పిస్తూ వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ విమర్శానత్మక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీంతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి,తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేశ్‌ జగన్‌పై ‘ట్విట్టర్‌’లో విమర్శలు గుప్పించారు.పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల రద్దు ఎఫెక్ట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని లోక్ సభ వేదికగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ  ఏపీ ప్రభుత్వ నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కొత్త అవరోధం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలను తుగ్లక్ గారూ విన్నారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.రివర్స్‌ టెండరింగ్‌ వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని , ఇది చాలా తప్పు నిర్ణయంగా జల శక్తి వనరుల మంత్రి షెకావత్ అభిప్రాయపడ్డారు.ఇక ఇదే విషయంపై నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.మీ తుగ్లక్ చర్యల వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. ఖర్చు కూడా పెరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారుఅని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో రూ. 2,600 కోట్ల అవినీతి జరిగిపోయిందంటూ లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కుందని చెప్పారు.కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకే కనిపించిందా అంటూ ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆషామాషీ కాదని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల సంఘం, కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులను విడుదల చేస్తుందని నారా లోకేశ్ తెలిపారు. కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు మాత్రమే కనిపించిందని జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos