కనీస మద్దతు ధర నిర్ణయానికి సమితి

కనీస మద్దతు ధర నిర్ణయానికి సమితి

న్యూఢిల్లీ : వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గురించి నియమించనున్న సమితికి ఐదుగురు సభ్యుల పేర్లను సూచించాలని సమాఖ్య ప్రభుత్వం కోరిందని సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు హరీందర్ సింగ్ లఖోవాల్ బుధవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఎవరి పేర్లను సూచించాలో డిసెంబరు 4న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. ఈ సమితి నిర్ణీత కాల వ్యవధిలో పని చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సాగు చట్టాలపై నిరసనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటారని ఆశించారు. హర్యానాలో రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖత్తార్ సంకేతాలు పంపించారన్నారు. పంజాబ్లో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు .అదేవిధంగా రైల్వేలు, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్, ఢిల్లీ పోలీసులు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన సుమారు 700 మంది రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos