ఇమ్రాన్‌ఖాన్‌ పుండుపై భారత్ కారం..

ఇమ్రాన్‌ఖాన్‌ పుండుపై భారత్ కారం..

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు,జమ్ము కశ్మీర్‌ విభజన నిర్ణయం అనంతరం పాకిస్థాన్‌ ఎంత తీవ్రస్థాయిలో మండిపడిందో ప్రపంచమంతటికీ తెలిసిన విషయమే.ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు పాసైన గంటల వ్యవధిలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ పరిణామమం యుద్ధానికి సైతం దారి తీయొచ్చని పుల్వామా వంటి దాడులు జరిగే అవకాశం ఉందంటూ పరోక్షంగా భారత్‌కు హెచ్చరికలు చేయడానికి ప్రయత్నించారు.మరోవైపు వాణిజ్య,దౌత్య పరంగా కూడా సంబంధాలు తెంచుకుంటున్నామని ప్రకటించడమే కాకుండా పాక్‌లో భారత దౌత్యాధికారి అజయ్ బిసారియాను భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీలోని పాక్ హైకమిషనర్‌ను కూడా తిరిగి పిలిపించుకుంది. మరోవైపు ఢిల్లీ – లాహోర్ బస్ సర్వీసును రద్దు చేసింది. ఆ పై సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను కూడా నిలిపివేసింది. పాక్‌లో భారత సినిమాలపై నిషేధం విధించింది.గగనతలాన్ని కూడా మూసివేసింది.ఇలా కఠిన నిర్ణయాలు తీసుకున్న అనంతరం భారత్‌ దిగివస్తుందని ఇమ్రాన్‌ఖాన్‌ భావించారు.అయితే జమ్ము కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్‌ తీసుకున్న నిర్ణయాలను భారత్‌ లెక్కచేయదని స్పష్టం చేయడంతో పాకిస్థాన్‌ మరింత కుమిలిపోతోంది. గంటల వ్యవధిలో పాక్ ప్రభుత్వం అన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ భారత ప్రధాని మోడీ కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా నేరుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు. పైగా ఆయన ప్రధాన కార్యదర్శి నుంచి ఒక ప్రెస్ నోట్ మాత్రమే విడుదలైంది. విదేశాంగ కార్యదర్శి కూడా పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు . పాక్ ప్రభుత్వంకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారత ప్రధాని కానీ, హోంమంత్రి కానీ , విదేశాంగ మంత్రి అవసరం లేదని పరోక్షంగా చెబుతూనే పాక్ ప్రభుత్వం స్థాయి ఏంటో గుర్తు చేసే ప్రయత్నం చేసింది.అంటే ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది భారత ప్రభుత్వం. డోన్ట్ కేర్ అన్న రీతిలో పాక్ ప్రభుత్వాన్ని ఒక పుల్లతో సమానంగా చూసింది. అంతేకాదు పాక్ ప్రభుత్వం బెదిరింపులకు తాము బెదిరేదిలేదని పరోక్షంగా ప్రపంచదేశాలకు తెలిపింది. కఠిన నిర్ణయాలు తీసుకున్నా భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాక్ ప్రభుత్వం కలవరపాటుకు గురవుతోంది.ఇది చాలదన్నట్లు భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించిన నిర్ణయంపై జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌దోవల్‌ చేసిన ట్వీటు పాకిస్థాన్‌కు మరింత కాలేలా చేస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos