అనాలోచిత వ్యాఖ్యలు తగవు

అనాలోచిత వ్యాఖ్యలు తగవు

న్యూ ఢిల్లీ: ‘ప్రధాని మంత్రి స్థాయిలోని వ్యక్తి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ వైనా పదాలను వాడేటప్పుడు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకోవాల’ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. గత శుక్రవారం జరిగిన ఆఖిల పక్ష సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురయ్యాయి. ‘సరిహద్దులో భారత భూభాగాన్ని కాపాడేందుకు కల్నల్ బి.సంతోష్ బాబు, మన జవాన్లు చేసిన ప్రాణ త్యాగాలను తక్కువ చేసి చూడవద్దు. అది ప్రజల నమ్మకాన్ని వంచించినట్టే. మనం చరిత్రాత్మక కూడలిలో నిలబడివున్నాం. మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్యలు భావి తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని మరువ రాదు. మన్మోహన్, మన ప్రజా స్వామ్యం ప్రధాని కార్యాలయంలోనే ఆగి పోయింది. జాతి భద్రత, సరిహద్దు అంశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే వేళ, జాతి భద్రతను మనసులో ఉంచుకుని మాట్లాడాల’ని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos