అమెరికా బలగాలను ఐక్యంగా తరమికొట్టాలి

అమెరికా బలగాలను ఐక్యంగా తరమికొట్టాలి

టెహ్రాన్: మధ్య ప్రాచ్య ప్రాంతం నుంచి అమెరికా బలగాలను తరమికొట్టేందుకు అండగా నిలవాలని ఇరాన్ ఇరుగు పొరుగు దేశాలకు మంగళవారం పిలుపు నిచ్చింది. పశ్చిమాసియాలో అమెరికా టెర్రరిస్టు బలగాలు ఉన్నంత వరకు శాంతి, రక్షణ ఉండవని తెలిపింది. అమెరికా బలగాలను తరిమికొట్టేందుకు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు తమతో చేతులు కలపాలని కోరింది. అన్ని దేశాలు ఒకటైతేనే అమెరికా బలగాలను వెళ్లగొట్టగలమని చెప్పారు. ఇరాన్ జాతీయ భద్రతా విభాగం సెక్రటరీ అలీ షంఖానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇరాక్, సిరియా దేశాలు అమెరికా వల్ల అస్థిరత్వానికి గురయ్యాయని విమర్శించారు. అమెరికా బలగాలను వెళ్లగొట్టడం ఒక్కటే సరైన చర్య అన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని దేశాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos