చిన్నికృష్ణపై విరుకుపడుతున్న మెగా అభిమానులు..

చిన్నికృష్ణపై విరుకుపడుతున్న మెగా అభిమానులు..

లోక్‌సభ ఎన్నికలు,శాసనసభ ఎన్నికలతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను రాజకీయ పార్టీల నేతలకు ధీటుగా రాజకీయ,వ్యక్తిగత విమర్శలు,ఆరోపణలు చేసుకుంటూ సినీరంగ ప్రముఖులు కూడా రాజకీయ వేడిని మరింత రాజేస్తున్నారు.అలీ-పోసాని-నాగబాబు-పృథ్వీ-తాజాగా రచయిత చిన్నికృష్ణ కూడా ఈ జాబితాలో చేరాడు.రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన చిన్నికృష్ణ మెగా ఫ్యామిలీపై కొంచెం హద్దులు దాటి విమర్శలు చేసినట్లు కనిపిస్తోంది.చిన్నికృష్ణ చేసిన వ్యాఖ్యలు, విమర్శలపై మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు సాధారణ ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. `నేను నోరు తెరిస్తే పవన్ నవరంధ్రాలు మూసుకోవాల్పిందే. మీరు.. మీ కుటుంబం ఏ పార్టీతో చేతులు కలిపారో ఆ పార్టీ సభ్యులందరికి కూడా పేరు పేరున చెబుతున్నాను. నా నోరు తెరిపించే పనిచేయొద్దని హెచ్చరిస్తున్నాను“ అంటూ చిన్నికృష్ణ వ్యాఖ్యానించడం సంచలనమైంది. దీనికి మెగా ఫ్యాన్స్ అంతే ధీటుగా స్పందిస్తున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో కనీసం ఉంటున్న గది అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నపుడు నీకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది మెగా ఫ్యామిలీయేనని చిన్నికృష్ణకు గుర్తు చేశారు.మెగా ఫ్యామిలీ హీరోలపై ప్రశంసలు కురిపిస్తూ చిన్నికృష్ణ గతంలో స్టేజ్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియోను మెగా ఫ్యామిలీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.“అన్నం పెట్టిన చెయ్యి ని నరికే నమ్మక ద్రోహులు చాలా మంది ఉంటారు. గరళం మింగిన శివుడు ఎలాగో అన్నయ్య చిరంజీవి అలాగే. ఆయన స్పందించక పోవచ్చు కానీ ఆ కాశీ విశ్వనాధుడే నీ లాంటి వాళ్ళని దించుతాడు. చిన్ని కృష్ణ థూ ….!“ అంటూ చీవాట్లు వేసారు. అల్లు అర్జున్ బద్రీనాథ్ ఈవెంట్ లో వీడియో ఇది. బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు  వంటి బ్లాక్ బస్టర్ కు కథ అందించిన చిన్నికృష్ణ మెగా ఫ్యామిలీ హీరోలకు ఇంద్ర – బద్రీనాథ్ వంటి  కథల్ని అందించాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు రూ.3000 రెంటు కట్టే ఇంట్లో ఉన్నప్పుడు అల్లు అరవింద్ రూ.10లక్షలు ఇచ్చి భారతదేశంలో ఎక్కడికి వెళ్లి అయినా కథ రాసుకుని రా అని ఆదుకున్నారని ఎంతో ఆవేదనగా చిన్నికృష్ణ ఆ వీడియోలో మాట్లాడడం కనిపించింది. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిన్నికృష్ణను చెడుగుడు ఆడేస్తున్నారు.మెగాఫ్యామిలీపై చిన్నికృష్ణ కురిపించిన పొగడ్తల వీడియో మీరు కూడా ఒకసారి చూడండి మరి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos