భాగ్యనగరం పోలీసులు దేశానికి ఆదర్శం

భాగ్యనగరం పోలీసులు దేశానికి ఆదర్శం

లక్నో: దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ ను బహుజన్ సమాజ్ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి హర్షించారు. మహిళలపై దురాగతాలు పెరిగిపోతున్న ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆమె ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఉత్తర ప్రదేశ్లో మహిళలపై దురాగ తాలు పెచ్చరిల్లుతున్నా ఇక్కడి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. ఇక్కడి పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా హైదరాబా ద్ పోలీసుల నుంచి స్ఫూర్తి పొందాలి. దురదృష్ట వశాత్తూ ఇక్కడ నేరస్తుల్ని రాష్ట్రానికి అతిథుల మాదిరి చూసుకుం టున్నారు. యూపీలో ఆటవిక రాజ్యం నడుస్తోంది’ అని మండిపడ్డారు. దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితు లను పోలీసు లు ఇవాళ తెల్లవారు జామున ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో.. ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు. నిందితులు దిశకు నిప్పంటించిన ప్రదేశానికి అత్యంత సమీపంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos